మహేష్ మీద కన్నేసిన కుమారి..!

ఛాన్సును బట్టి హీరోయిన్స్ తమ ఇష్టాయిస్టాలను మార్చుకుంటారన్నది తెలిసిందే. ఒక హీరోయిన్ కెరియర్ కొత్తలో ఒక స్టార్ హీరోయిన్ తన అభిమాన నటుడని చెబుతుంది. అయితే కాస్త క్రేజ్ రాగానే వారిని కాదని మరో హీరో పేరు ప్రస్థావిస్తుంది. ప్రస్తుతం అలానే కుమారి హీరోయిన్ హెబ్భా కూడా నిన్న మొన్నటిదాకా మెగా హీరోలను పొగుడుతూ వచ్చి సడెన్ గా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ మీద కన్నేసింది. తనకు ఇష్టమైన హీరో మహేష్ అంటున్న హెబ్భా ఛాన్స్ వస్తే మహేష్ తో నటించేందుకు సిద్ధమే అంటుంది. ఇక అదే క్రమంలో నాని అన్నా కూడా ఇష్టమే అంటుంది.

మెగా హీరోలను వల్లో వేసుకుంటే వారి ఒక్క ఛాన్స్ తో ఐదారు సినిమాలు చేయొచ్చని ఆలోచన చేసిన హెబ్భా అక్కడ వర్క్ అవుట్ కాకపోవడంతో ఇప్పుడు తన ఇష్టం మార్చుకుని మహేష్ ను టార్గెట్ చేస్తుంది . మరి మహేష్ గురించి ఇలా మాట్లాడితే అతనితో ఐటం సాంగ్ అయినా వస్తుందని అనుకుంటుందో ఏమో కాని హెబ్భా మాత్రం  మహేష్ అంటూ కొత్త కలవరింత స్టార్ట్ చేసింది.  

హేమా హేమీలనే పట్టించుకోని మహేష్ హెభ్హా పటేల్ గురించి ఆలోచిస్తాడా అని అందరు అనుకుంటున్నారు. మహేష్ తో నటించాలంటే అమ్మడు ఇప్పుడున్న క్రేజ్ ఏమాత్రం సరిపోదని కొంతమంది వాదన. ఏది ఏమైనా ఛాన్స్ వస్తుంది అన్నట్టుగా ఇష్టమైన హీరోని మార్చేసే హెబ్భ ఇప్పుడు మహేష్ అంటుంది కదా.. ఒకవేళ మహేష్ కూడా ఆఫర ఇవ్వకపోతే మళ్లీ ఈసారికి వేరే హీరో పేరు చెబుతుందేమో చూడాలి.