
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రచయిత కోనా వెంకట్ ఇన్వాల్వ్ మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందట. టాలీవుడ్ లో క్రేజీ సినిమాలకు రైటర్ గా సూపర్ ఇమేజ్ ఏర్పరచుకున్న కోనా ఈ మధ్య రేసులో వెనుకపడ్డారు. కుర్ర రైటర్స్ తమ క్రియేటివిటీతో సత్తా చాటుతుంటే ఇంకా కోనా రొటీన్ కమర్షియల్ ఫార్ములానే ఫాలో అవుతున్నాడంటూ కామెంట్స్ చేశారు.
జనతా గ్యారేజ్ తర్వాత తారక్ తీస్తున్న సినిమాకు బాబి డైరక్షన్ అయినా కోనా వెంకట్ కూడా వర్క్ అవుట్ చేస్తున్నాడట. కథ కథనాలు బాబివే అయినా సినిమాకు కోనా డైలాగ్స్ రాస్తున్నాడట. నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే బాద్షా సినిమా టైంలో కోనా వెంకట్ తో పనిచేశాడు ఎన్టీఆర్. మరి ఈ ఇద్దరి వర్క్ అవుట్స్ సినిమాను ఎలా ప్రేక్షకులకు చేరువేస్తాయో చూడాలి.
జనతా గ్యారేజ్ హిట్ తో మరింత భాధ్యత పెరిగిన తారక్ చేసే ప్రతి సినిమాను అదే రేంజ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. సినిమాలో ట్రిపుల్ రోల్ చేస్తున్న తారక్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడట.