వామ్మో.. సన్నితో 5 మినిట్స్ కు 4 కోట్లా..?

న్యూ ఇయర్ వస్తుంది అంటే చాలు హాట్ హీరోయిన్స్ తెగ బిజీ అయిపోతారు. డిసెంబర్ 31 నైట్ వారు చేసే డ్యాన్స్ షోలకు కోట్లకు కోట్లు గుమ్మరిస్తారు. ప్రస్తుతం ఎక్కడికి అక్కడ ఛాన్స్ ఉన్నంతలో హీరోయిన్స్ ను ఆ రాత్రికి బుక్ చేసుకుంటుండగా పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ హాట్ స్టార్ గా టర్న్ అయిన సన్నికి మాత్రం లెక్కలేనన్ని ఆఫర్లు వస్తున్నాయట. ఆల్రెడీ రెండు చోట్ల భారీ మొత్తానికి కమిట్మెంట్ ఇచ్చిన సన్నికి ఇప్పుడు ఓ టెంప్టింగ్ ఆఫర్ వచ్చిందట. అది కూడా 5 నిమిషాలకు 4 కోట్లట.  

ఇప్పటికే ఆరోజు నైట్ కు షెడ్యూల్ బిజీ అని చెప్పేస్తున్న సన్నికు ఓ హోటెల్ వారు కండెక్ట్ చేస్తున్న న్యూ ఇయర్ ఈవెంట్ లో జస్ట్ వచ్చి ఓ 5 నిమిషాలు పాటకు డ్యాన్స్ వేస్తే ఏకంగా 4 కోట్లు ఇస్తామని అన్నారట. 5 నిమిషాలకు 4 కోట్లా బేరం బాగా తగలడంతో అమ్మడు మారు మాట్లాడకుండా ఓకే చేసిందట. ప్రస్తుతం తను నటిస్తున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ రాయీస్ సినిమాలోని ఐటం పాటనే ఆ ఈవెంట్ లో హాట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని డీల్ అట.

సో అలా సన్ని ఆ రోజు రాత్రి అటు ఆడియెన్స్ కు లైవ్ ఎంటర్టైన్ ఇస్తూనే మరో పక్క తాను కోట్లకు కోట్లు వెనుకేసుకుంటుంది. చూస్తుంటే న్యూ ఇయర్ ఈవెంట్ లో సన్నిని బీట్ చేసే వారు లేరని అనిపిస్తుంది.