
బుల్లితెర మీద తమ యాంకరింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లాస్య ఇప్పుడు వెండితెర మీద తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు వస్తుంది. కొన్నాళ్లుగా స్మాల్ స్క్రీన్ పై తన క్యూట్ యాంకరింగ్ తో అలరిస్తున్న అమ్మడు ఈమధ్య స్మాల్ స్క్రీన్ పై మెరవడం తగ్గించింది. దీనికి కారణం ఆమెకు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడమే అని తెలుస్తుంది. శ్రీరామరాజ్యం నిర్మాత సాయి బాబు తనయుడు రేవంత్ హీరోగా చేస్తున్న సినిమా రాజా మీరు కేక. నూతన దర్శకుడు కృష్ణ కిశోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తుంది.
ఇక సినిమాలో మరో స్పెషల్ థింగ్ ఏంటంటే నందమూరి హీరో తారకరత్న విలన్ గా చేస్తున్నాడట. హీరోగా ఎలాగు అవకాశాలు రావట్లేదని ఈమధ్యనే రాజా చెయ్యి వేస్తేతో విలన్ గా మారిన తారరత్న మరోసారి విలన్ గా తన లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చిందని తెలుస్తుంది. సినిమాలో లీడ్ హీరోయిన్ గా లాస్య తనకున్న స్మాల్ స్క్రీన్ అనుభవంతో అదరగొడుతుందట. మరి స్మాల్ స్క్రీన్ క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తున్న ఈ అమ్మడికి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. రాజా మీరు కేక టైటిల్ కూడా చాలా విచిత్రంగా ఉండటంతో ప్రమోషన్స్ కూడా అదే రేంజ్లో చేసేలా ప్లాన్ చేస్తున్నారు.