జక్కన్నకు అసలైన కాంపిటీటర్..!

తన మొదటి సినిమా నుండి ఓటమంటూ ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి. తన సినిమాలో హీరో స్టారా, కమెడియనా కాదు ఆఖరుకి ఈగని పెట్టి కూడా హిట్ కొట్టేయగల సత్తా ఉన్న దర్శకుడు జక్కన్న. సౌత్ లో టాప్ చైర్ కు పోటీ పడుతున్న శంకర్ కు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తున్నాడు రాజమౌళి. అయితే అలాంటి రాజమౌళికి తెలుగు దర్శకుల్లోనే కాంపెటీషన్ మొదలైంది. తన ప్రతి సినిమాతో ఓ కొత్త సంచలనం సృష్టిస్తున్న క్రిష్ ఇప్పుడు జక్కన్నకు తలనొప్పిగా మారుతున్నాడు. 

రాజమౌళిని మించిన క్రియేటివిటీతో క్రిష్ టాలెంట్ ఏంటో నిన్న రిలీజ్ అయిన శాతకర్ణి ట్రైలర్ తో తెలుస్తుంది. సినిమా మరో సంచలనం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య శాతకర్ణిగా అదరగొట్టేశాడని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. 2 నిమిషాల ట్రైలర్ లోనే అద్భుతం చూపించిన క్రిష్ ఇక సినిమాలో ఎలాంటి సర్ ప్రైజులు ఇస్తాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

చేసే ప్రతి సినిమా పర్ఫెక్షన్ తో చేసే క్రిష్ ఫ్యూచర్ లో రాజమొళికి మంచి కాంపిటీటర్ అవుతాడనడంలో సందేహం లేదు. ఇప్పటికే శాతకర్ణి ట్రైలర్ చూసి హ్యాట్సాఫ్ టూ క్రిష్ అని ట్వీట్ చేశాడు. సో జక్కన్నలో ఆ భయం మొదలైందని ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు.