
నిన్న రిలీజ్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్ తో మెగాస్టార్ ను టార్గెట్ చేశాడు సంచలన దర్శకుడు రాం గోపా వర్మ. తానో మెగాస్టార్ అభిమాని అయినా సరే మెగాస్టార్ ఇలాంటి సినిమా చేయాలని తెలుగు సినిమా స్థానికి మరో లెవల్ కు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని అన్నారు. నిజంగా జెన్యూన్ మెగాస్టార్ ఫ్యాన్స్ చెప్పండి మెగాస్టార్ బాహుబలి, శాతకర్ణి లాంటి సినిమాలు తీయగలడా అని షాకింగ్ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగిపోకుండా శాతకర్ణి ఫైట్ తో సంక్రాంతి వార్ కూడా వన్ సైడ్ అయ్యిందని అన్నాడు.
మెగా కత్తి కన్నా షార్ప్ గా ఉన్న ఈ ట్రైలర్ ను ప్రస్థావిస్తూ డైరక్టర్ క్రిష్ కు కృతజ్ఞత తెలిపి.. బాలకృష్ణకు కంగ్రాట్స్ చెప్పాడు వర్మ. సినిమా ట్రైలర్ గురించి మాట్లాడటం ఓకే కాని అందులో మెగాస్టార్ గురించి ఎద్దేవా చేయడం మళ్లీ గొడవకు దారితీస్తుంది. ఛాన్స్ దొరికితే వర్మ మెగాస్టార్ ను టార్గెట్ చేయడం ఫ్యాన్స్ అసహనానికి గురి చేస్తుంది. ఇప్పటికే దీనిపై వర్మకు మెగా ఫ్యాన్స్ నెగటివ్ ట్వీట్ పెడుతున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా శాతకర్ణి ట్రైలర్ అదరగొట్టగా ఆ ట్రైలర్ తో మెగాస్టార్ ను టార్గెట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు వర్మ.