
సినిమా రికార్డులకు సినిమా హీరోలకు ఒక్కప్పుడంటే కేవలం సినిమాలు కలక్షన్స్ మాత్రమే రికార్డులుగా పరిణగలోకి తీసుకునే వారు కాని ఇప్పుడు టీజర్ దగ్గర నుండి ఏది వదలకుండా రికార్డులను చూసేస్తున్నారు. ఆ క్రమంలోనే 2016లో గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన తెలుగు హీరో ఎవరంటే ఎన్.టి.ఆర్ అని తెలిసింది. తారక్ గురించి ఎక్కువ సార్లు గూగుల్ లో సెర్చ్ చేయడం జరిగిందన్నమాట.
అయితే ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో అల్లు అర్జున్ ఉన్నాడు. ఇక మూడో ప్లేస్ లో మహేష్.. ఆ తర్వాత ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నారు. జూనియర్ ఎన్.టి.ఆర్ అని లెక్క చూస్తే వరకు తెలుగులో అల్లు అర్జున్ మాత్రమే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడట. మరి ఎన్.టి.ఆర్ అంటే జూనియర్ సీనియర్ అన్నది పక్కన పెడితే తారక్ ఈ సంవత్సరం గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఎక్కువగా వెతకబడిన తెలుగు హీరోగా రికార్డ్ సాధించాడు.
జనతా గ్యారేజ్ తో కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా హిట్ అందుకున్న తారక్ ప్రస్తుతం బాబి డైరక్షన్లో మూవీకి సిద్ధమవుతున్నాడు. రీసెంట్ గా ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమా సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్లనున్నదట.