ఆ హీరోయిన్ ఎంగేజ్మెంట్ అంతా బూటకమేనా..!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రెజినా కసాండ్రా సడెన్ గా ఓ రోజు తనకు ఎంగేజ్మెంట్ అయ్యిందని.. తన నుండి దేవుడే అతన్ని కాపాడాలని ట్వీట్ చేసింది. అయితే అది ఎందుకో మళ్లీ వెంటనే ఆమె డిలీట్ చేసిందనుకోండి. ఇప్పటికే ఈ న్యూస్ అంతా స్ప్రెడ్ అయ్యింది. రెజినాకు నిజంగానే ఎంగేజ్మెంట్ అయ్యిందా.. ఆ లక్కీ ఫెలో ఎవరు.. హీరోనా లేక బిజినెస్ మ్యానా అంటూ రకరకాలుగా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. 

ఆ వెంటనే అమ్మడు అలాంటిదేమి లేదని చెప్పినా రెజినా ఏదో విషయం దాస్తుంది అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈమధ్యనే తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న రెజినా తనకు ఎంగేజ్మెంట్ కాలేదని తాను ఎవరిని ప్రేమించడం లేదని ఫైనల్ క్లారిటీ ఇచ్చేసింది. నిజంగా ఆమెకు ఎంగేజ్మెంట్ అయ్యింది అని షాక్ లో ఉన్న ఆమె ఫ్యాన్స్ కు ఇదో తీపి కబురైంది. సో రెజినా ఎంగేజ్మెంట్ అంటూ చేసిన హడావిడి అంతా ఫ్యాన్స్ ను ఆటపట్టించడానికే అన్నమాట. మరి ఇలాంటి విషయాల్లో కామెడీ చేయమని ఎవరు నేర్పించారో ఏమో కాని ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆ న్యూస్ తో కాస్త షాక్ అయ్యారన్నది నిజం.