
పవర్ స్టార్ పవన్ ఫాలోయింగ్ తెలుసుకుని ఎలాగైనా పవన్ తో సినిమా చేయాలని దాసరి నారాయణ రావు ప్రయత్నించాడు. రెండు సంవత్సరాలుగా ఇప్పుడు అప్పుడు అంటూ చెప్పుకొస్తున్నారే తప్ప ముందడుగు వేయట్లేదు. అయితే ఈ క్రమంలో పవర్ స్టార్ రెండు మూడు సినిమాల క్యూ పెట్టేశాడు. ఇక ఈ టైంలో దాసరి కూడా పవన్ కు కబురు పంపాడట. అయితే దాసరి పిలుపుకి పవర్ స్టార్ తరపున సరైన స్పందన రాలేదని ఇన్నర్ టాక్.
అంతేకాదు దాదాపు వారి కాంబినేషన్ లో సినిమా అటకెక్కినట్టే అని తెలుస్తుంది. పవన్ ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యే సరికి 2017 ద్వితియార్ధం వచ్చేస్తుంది. ఇక ఇప్పటికే డివివి దానయ్య దగ్గర అడ్వాన్స్ తీసుకున్న పవర్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేశాక అతనితో ఓ సినిమా చేయాలి. ఇక అది చేసే సరికి ఎలాగు 2018 వచ్చేస్తుంది. ఇక అప్పటికే 2019 ఎలక్షన్స్ టార్గెట్ పెట్టుకున్న పవన్ కనీసం ఒక సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండి ప్రచారం మొదలు పెట్టాలి. సో దాసరి సినిమా చేయడానికి ఏమాత్రం అవకాశం లేదని అర్ధమవుతుంది.
ఒకవేళ డేట్స్ అడ్జెస్ట్ చేసి ఏమన్నా చేస్తే తప్ప దాసరి పవన్ ల సినిమా ఉంటే గింటే కనుక 2019 ఎలక్షన్స్ తర్వాతే అంటున్నారు. మరి దీనికి దాసరి ఎలా స్పందిస్తాడో ఈ ట్విస్ట్ ఎప్పుడు వీడుతుందో చూడాలి.