మొదటిసారే కాని అదరగొట్టిన వెంకటేష్

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న గురు సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది. జిగిడి జిగిడి అంటూ హమ్ చేస్తున్న వెంకటేష్ ను చూసి గురు గెటప్ తో పాటుగా వెంకీ హుశారుకి బాగా కనెక్ట్ అయ్యారు అభినానులు. అయితే బాగా అబ్సర్వ్ చేస్తే ఆ జిగిడి జిగిడి అనేది కూడా వెంకటేష్ అని తెలిసింది. సో గురు సినిమా కోసం వెంకటేష్ ఆ సాంగ్ పాడారన్నమాట. కెరియర్ లో హీరోగా ఎన్నో సినిమాలు తీసినా కేవలం హీరోగా మాత్రమే తన టాలెంట్ చూపించిన వెంకటేష్ మొదటిసారి సింగర్ గా మారాడు.   

మరి ఈ ఆలోచన ఎవరిదో తెలియదు కాని వెంకటేష్ పాడిన జిగిడి జిగిడి మాత్రం హుషారుగా ఉంది. సీనియర్ హీరోలంతా కేవలం యాక్టింగ్ తోనే కాకుండా ఇలా స్పెషల్ ఎట్రాక్షన్స్ తో అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. రీసెంట్ గా కింగ్ నాగార్జున కూడా నిర్మలా కాన్వెంట్ లో కొత్త కొత్త భాష అంటూ తన సింగింగ్ టాలెంట్ చూపించాడు. అయితే వెంకటేష్ కూడా అలా పాట మొత్తం పాడాడా లేక కేవలం జిగిడి జిగిడి అన్న మాటే చెప్పాడా అన్నది తెలియాల్సి ఉంది.