
రాఘవేంద్ర రావు డైరక్షన్లో కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా ఓం నమో వెంకటేశాయ. హతిరాం బాబా జీవిత చరిత్రతో వస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు కూడా ఉంటున్నాడనేది లేటెస్ట్ న్యూస్. అనుష్క, ప్రగ్యా జైశ్వాల్, విమలా రామన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో భక్తితో పాటుగా రక్తిని కూడా ఉంచుతున్నాడట రాఘవేంద్ర రావు. దర్శకేంద్రుడు సినిమాలో రొమాన్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిసిందే. సినిమాలో మహరాజుగా నటిస్తున్న జగపతి బాబు విమలా రామన్ తో రొమాన్స్ చేస్తాడట.
ఇప్పటికే గాయం-2, చట్టం సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు నమో వెంకటేశాయలో కూడా కలిసి రొమాన్స్ చేస్తున్నారట. సినిమాకు కావాల్సిన రొమాంటిక్ టచ్ ఈ ఇద్దరు ఇచ్చేస్తారని టాక్. అసలే జగ్గు భాయ్ నాగ్ కలిసి చేస్తున్నారనే న్యూస్ ఒక ట్విస్ట్ అయితే విమలా రామన్ తో రొమాన్స్ అనేసరికి సినిమా మీద ఇంకాస్త ఎక్సయిట్మెంట్ పెంచుకున్నారు ఆడియెన్స్. మహేష్ రెడ్డి నిర్మిస్తున ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించారు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగార్జున హతిరాం బాబాగా ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. మరి సినిమా నాగార్జున హిట్ మేనియాను కంటిన్యూ చేసేలా ఉంటుందో లేదో చూడాలి.