చిరు డైరక్షన్లో..!

మెగాస్టార్ చిరంజీవి కేవలం హీరోగానే కాదు డైరక్టర్ గా కూడా తన సత్తా చూపించనున్నారు. ఏంటి చిరు డైరక్షనా అని కాస్త షాక్ అవ్వొచ్చు ప్రస్తుతం ఖైది నెంబర్ 150 సినిమా షూట్లో ఇలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ షాట్ లో వినాయక్ నటిస్తుండగా ఆ సీన్ ను మెగాస్టార్ డైరెక్ట్ చేయడం విశేషం. సో ఈ రకంగా కూడా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్నాడు చిరంజీవి. సినిమా పూర్తయిన సందర్భంగా వినాయక్ నటిస్తున్న సీన్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అందులో మెగాస్టార్ యాక్షన్ చెప్పడం అందరు గమనించవచ్చు. సో ఆ సీన్ డైరెక్ట్ చేసింది మెగాస్టార్ అన్నమాట.

వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఖైది నెంబర్ 150 సినిమా షూటింగ్ నిన్నటితో పూర్తి చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 9 ఏళ్ల తర్వాత సోలోగా వస్తున్న చిరు మూవీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మెగాస్టార్ మూవీ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఓ సాంగ్ బిట్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఈ నెల 25న విజయవాడలో ఆడియో రిలీజ్ జరుపుకోబోతున్న ఖైది నెంబర్ 150 మూవీ జనవరి 11న రిలీజ్ అని అంటున్నారు.