
లోకనాయకుడు కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి ఈ ఇద్దరితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పోలిక ఏంటి అంటే.. ఎన్.టి.ఆర్, ఏయన్నార్ కాలంలో ఆ హీరోలు ఒకే సినిమాలో ఎన్ని పాత్రలు చేశారో వారికే తెలుసు. అయితే ఆ తర్వాత కేవలం ఒకే సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో అంటే ట్రిపుల్ రోల్ లో కనిపించి మెప్పించారు కమల్ హాసన్, చిరంజీవి. విచిత్ర సోదరులులో కమల్, ముగ్గురు మొనగాళ్లులో చిరు త్రిపాత్రాభినయంలో తమ సత్తా చాటారు.
ఇక ఆ స్పూర్తితోనే బాబి చెప్పిన కథలో ట్రిపుల్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ తర్వాత ఏ సినిమా చేస్తాడా అనుకున్న ఫ్యాన్స్ కు ఓ ఫ్లాప్ డైరక్టర్ అవకాశం ఇచ్చి షాక్ అయ్యేలా చేసిన తారక్ సినిమాలో ట్రిపుల్ రోల్ అనే సరికి ఎలాగైనా ఈ సినిమా చేసి తన స్టామినా చూపించాలని అనుకుంటున్నాడు. పవర్ తో హిట్ అందుకున్న బాబి సర్దార్ డైరక్టర్ గా పేరు మోశాడు కాబట్టి ఆ ఫ్లాప్ తన ఎకౌంట్ లో రాక తప్పదు.
మరి ఫ్లాప్ వచ్చినా బాబి చెప్పిన కథ మీద ఇంకా తనకు నచ్చిన ట్రిపుల్ రోల్ మీద ఇష్టంతో సినిమా చేస్తున్న తారక్ సినిమా ఫలితాన్ని ఎలా అందుకుంటాడో చూడాలి. ఇప్పటికే అదుర్స్ లో డ్యుయల్ రోల్ తో అలరించిన తారక్ ఆ సినిమాలో చేసిన రెండు పాత్రలకు మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. మరి ఈసారి చేస్తున్న ట్రిపుల్ రోల్ ఎలా ఉండబోతుందో చూడాలి.