
రోహిత్ కేపీ దర్శకత్వంలో సాయిదుర్గా తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా చేస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగకు ముందు విడుదల కాబోతోంది.
ఈ సినిమా చేస్తుండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తేజ కాకుమాను దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో సాయిదుర్గా తేజ్‌కు జోడీగా కన్నడ నటి సప్తమి గౌడ నటించబోతున్నారు.
రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ సినిమాతో సప్తమి గౌడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నితిన్ హీరోగా వచ్చిన ‘తమ్ముడు’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు లేదా నవంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కనుక త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వస్తాయి.