గోపీచంద్ సింగ పవర్‌ఫుల్ లుక్

మాచో స్టార్ గోపీచంద్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘భరతవర్ష’ అనే పీరియాడికల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తికాక ముందే మరో యాక్షన్ సినిమా మొదలు పెట్టేశారు. 

ఈ సినిమాకు ‘సింగ’ అనే టైటిల్‌ను ఖరారు చేసి టైటిల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఆయుధం పట్టుకొని ఓ బండరాయిపై నిలబడిన గోపీచంద్ పోస్టర్‌ చూస్తే ఈ సినిమా కూడా పీరియాడికల్ మూవీ అని స్పష్టం అవుతుంది. ఇప్పటికే ‘సింగ’ షూటింగ్ 50 శాతం పూర్తయినట్లు చిత్రబృందం తెలిపింది. 

ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా, అనార్కలి నాజర్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు.

70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి నిర్మిస్తున్న ‘సింగ’కు  సంగీతం: సామ్ సీఎస్, కెమెరా: షామ్‌దత్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.