సూర్య ‘సీన్’ చూశారా?

తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడైన సూర్య హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్‌, యాక్షన్ మూవీ ‘సీన్’. ఈ సినిమాలో ఈశ్వరన్ అనే సైకోగా నటిస్తున్న కోలీవుడ్‌ నటుడు నస్లెన్‌ని పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. 

ఈ సినిమాలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా, ఆనందరాజ్, లాల్, రాజ్ ప్రియాన్ తదితరులు ముఖ్య  పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జీతు మాధవన్, తెలుగు డైలాగ్స్: రాకేందు మౌళి, సంగీతం: సుషిన్ శ్యామ్, కెమెరా: వినీత్ అగస్టియన్, ఆర్ట్:  ఏ.రాజేష్, ఎడిటింగ్: అజ్మల్ సాబు చేస్తున్నారు. 

జాగరం స్టూడియోస్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై  కలిసి హీరో సూర్య, అయన భార్య జ్యోతిక కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. జైశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్‌ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.