
తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘భగవంతుడు’. ఈ సినిమా నుంచి ‘ఓ ఎల్లమ్మ’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. జీజీ విహారి వ్రాసిన ఈ పాటకు ఎస్. కృష్ణ ప్రసాద్ సంగీతం అందించగా, అడ్డుల జంగిరెడ్డి ఆలపించారు.
ఈ సినిమాలో రిషి నాగరాజు, కాలకేయ ప్రభాకర్, మురళీధర్ గౌడ్, రవీంద్ర విజయ్, షెల్లీ, వినయ్ వర్మ, చిరాగ్ జానీ, బలగం సంజయ్, అధిరే అభి, మైమ్ మధు, జబర్దస్త్ జీవన్ తదితరులు నటిస్తున్నారు.
దివంగత పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై రవి కుమార్ పనస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: జి.జి. విహారి, కెమెరా: రాజ్ తోట, పాటలు: చంద్రబోస్, గోరేటి వెంకన్న, కాసర్ల శ్యామ్, జి.జి. విహారి, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, సంగీతం: ఎస్. కృష్ణ ప్రసాద్, యాక్షన్: రామ్ కిషన్, రాబిన్ సుబ్బు, రాజ్‌కుమార్, ఎడిటింగ్: ఎస్.హెచ్. ప్రవీణ్ పూడి చేశారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.