ఎల్లమ్మ రాకకు ముహూర్తం ఖరారు

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా హీరోగా నటిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. వేణు ఎల్దండి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ గ్రామీణ యువకుడు ‘పర్షి’గా నటిస్తున్నారు. అతనికి జోడీగా అనంతిక సనిల్ కుమార్‌ (మ్యాడ్, 8 వసంతాలు) నటిస్తోంది. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్, భాగ్యశ్రీ బోర్సే కీలకపాత్రలు చేస్తున్నట్లు సమాచారం.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వేణు ఎల్దండి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నారు.    

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు శిరీష్ కలిసి నిర్మిస్తున్న ‘ఎల్లమ్మ’ను 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.