
క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ టాలెంట్ ఏంటో అందరికి తెలిసిందే. సినిమా సినిమాకు ప్రేక్షకులను టెక్నికల్ గా అప్డేట్ చేస్తున్న సుకుమార్ మొదటి సినిమా ఆర్య అతను రాసిన కథతో వచ్చింది. ఇక ఆ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే అయితే ఆ తర్వాత సుకుమార్ సినిమాలైతే చేస్తున్నాడు కాని వేరే వాళ్ల దగ్గర నుండి కథ తీసుకోవడం దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో సుకుమార్ చేయబోయే రాం చరణ్ సినిమాకు మళ్లీ తానే కథ సిద్ధం చేశాడట.
పిరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా వన్ లైన్ ఆర్డర్ నుండి డైలాగ్ వర్షన్ దాకా మొత్తం తానై నడిపించాలని సుక్కు ప్లాన్ చేసుకున్నాడట. ఆర్య టైం లో సుకుమార్ టాలెంట్ చూసి అందరు వారెవా అనేశారు. అయితే ఇప్పుడు తన డైరక్షన్ తో సూపర్ అనిపించుకుంటున్న సుకుమార్ సినిమా కథ కూడా రాస్తే ఇక ఆ సినిమాకు తిరుగుండదని చెప్పొచ్చు.
ఏ దర్శకుడైనా సొంతంగా కథ రాసుకుంటే సినిమా మీద అతనికి ఉండే గ్రిప్ వేరేలా ఉంటుంది. మరి సుకుమార్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ధ్రువ సక్సెస్ తో సూపర్ జోష్ లో ఉన్న చెర్రి సంక్రాంతి తర్వాత సుక్కు సినిమా షూట్ ను స్టార్ట్ చేయనున్నాడు.