రానా చైతు ఇద్దరు కలిసి..!

దగ్గుబాటి రానా, అక్కినేని నాగ చైతన్య.. ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారా అంటే అలా కాకుండా ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేస్తున్నారట. అదేంటి రానాకు సురేష్ ప్రొడక్షన్, చైతుకి అన్నపూర్ణ ఉంది కదా అంటే ప్రయోగాలకు పెద్ద ప్రొడక్షన్స్ కాస్త దూరంగా ఉంటాయి. బాలీవుడ్ లో ఒక్కో హీరో తనకంటూ ఓన్ ప్రొడక్షన్ సెట్ చేసుకుని రకరకాల సినిమాలను తీస్తుంటారు. ఇదే క్రమంలో ఇప్పుడు రానా చైతులు కలిసి ఓ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేస్తున్నారట.  

ఇందులో కొత్త వారికి అవకాశం ఇవ్వడమే కాకుండా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఓ కొత్త దర్శకుడు చెప్పిన హర్రర్ కథ నచ్చడంతో నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయని టాక్. ఇక ఈ న్యూ ప్రొడక్షన్ హౌజ్ కు రామానాయుడు అవుట్ డోర్ యూనిట్, అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ పనిచేయనున్నాయి. మొత్తానికి తమ టేస్ట్ కు తగ్గ సినిమాల కోసం రానా, చైతులు ఇలా సెపరేట్ నిర్మాణ సంస్థ పెట్టేసుకున్నారన్నమాట.

మరి వీరి నిర్మాణంలో ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి. తెలుస్తున్న సమాచారం ప్రకారం సమంత ఈ ప్రొడక్షన్ హౌజ్ కు సంబందించిన కార్యక్రమాలను చూసుకుంటుందని టాక్.