
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం స్టార్ సినిమా అంటే మొదటి ఆప్షన్ అయిన రకుల్ ఈ ఇయర్ వచ్చిన మూడు సినిమాలు సక్సెస్ సాధించడంతో హ్యాట్రిక్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇయర్ మొదట్లోనే పొంగల్ సీజన్ లో నాన్నకు ప్రేమతో అంటూ వచ్చి హిట్ అందుకున్న రకుల్ ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడుతో సూపర్ హిట్ అందుకుంది.
ఇక ఈ రెండే కాకుండా ఈ ఇయర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీలో ఒకటిగా నిలిచిన మెగా పవర్ స్టార్ ధ్రువ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంది రకుల్. ప్రత్యేకంగా చెప్పాలంటే మొదటి రెండు సినిమాల కన్నా ధ్రువలో రకుల్ పర్ఫార్మెన్స్ గ్లామర్ రెండిటికి మంచి పేరు తెచ్చాయని చెప్పొచ్చు. మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ ఫ్యామిలీ హీరోలతో నటించడమే కాకుండా హిట్ అందిస్తుండటంతో మళ్లీ మళ్లీ ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటున్నారు.
ప్రస్తుతం మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ విన్నర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ మెగా హీరోలకు లక్కీ హీరోయిన్ అయ్యిందని చెప్పాలి. ఇక వారే మిగతా స్టార్ హీరోల సినిమాల్లో కూడా రకుల్ హీరోయిన్ గా ఛాన్సులు పట్టేస్తుంది.