
మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ సినిమా అంటే ఇక ఆ సినిమా ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా నితిన్ కు అఆ తో హిట్ ఇచ్చిన త్రివిక్రం ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఓ పక్క కాటమరాయుడు షూటింగ్ చేస్తున్న పవన్ అది ముగించుకుని త్వరలో ఈ సినిమా షూట్లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సునీల్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడని అంటున్నారు.
కమెడియన్ నుండి హీరోగా మారిన తర్వాత సునీల్ ఏ సినిమాలో స్పెషల్ క్యారక్టర్స్ కామెడీ క్యారక్టర్స్ లో కనిపించలేదు. అయితే సినిమాలైతే వరుసెంట చేస్తున్నాడు కాని అదే రేంజ్ ఫలితాలను అందుకోవడంలో విఫలమవుతున్నాడూ సునీల్. అందుకే స్వతహాగా స్నేహితుడైన త్రివిక్రం తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట. మరి త్రివిక్రం ఛాన్స్ అంటే ఇక సినిమా హిట్ గ్యారెంటీ అన్నట్టే. అది పవర్ స్టార్ సినిమా అంటే ఇక రికార్డులు బద్ధలే.
జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ తో త్రివిక్రం చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ ప్రచారంలో ఉన్నా అసలు టైటిల్ అది కాదని చిత్రయూనిట్ చెబుతున్నారు. మరి ఈ క్రేజీ ఆఫర్ తో సునీల్ కూడా హిట్ ట్రాక్ ఎక్కేస్తాడేమో చూడాలి.