
ఏదైనా సినిమా సూపర్ హిట్ అయితే చాలు తన మార్క్ ప్రశంసలతో ఆ జోష్ ను మరింత పెంచేస్తాడు దర్శక ధీరుడు రాజమౌళి. రీసెంట్ గా రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రాం చరణ్ ధృవ సినిమా గురించి హీరో చరణ్, డైరక్టర్ సురేందర్ రెడ్డి, రచయిత మోహన్ రాజాలను తన పొగొడ్తల వర్షం కురిపించారు రాజమౌళి. ముందు కథ ఉంచి ఇమేజ్ ను వెనుక పెట్టి చరణ్ చేసి పర్ఫార్మెస్ అద్భుతం అనేస్తున్నాడు రాజమౌళి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చరణ్ ఫిజిక్, ఎక్స్ ప్రెషన్స్ సూపర్ అనేశాడు. ఇక ఈ సినిమా ఇంత బాగా రాడానికి రచయిత మోహన్ రాజాకు స్పెషల్ గ్రీటింగ్స్ తెలిపారు.
ధృవ ఇంత మంచి అవుట్ పుట్ రాడానికి ముఖ్యంగా రచయిత మోహన్ రాజా పనితనం గొప్పదని.. అతనే సినిమాకు రియల్ హీరో అనేశారు. ఇక అరవింద్ స్వామి కూడా తమిళంలో ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని ఇక్కడ కూడా ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా చేశాడని అన్నారు. మొత్తానికి రాజమౌళి ట్వీట్ తో ధృవ టీం లో సరికొత్త ఉత్సాహం వచ్చింది. సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చెర్రి యూఎస్ లోనే ప్రమోషన్ కార్యక్రమాలను చేస్తున్నారు.
తమిళ సూపర్ హిట్ సినిమా తని ఒరువన్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ తో పాటుగా ఎన్వీ ప్రసాద్ కూడా నిర్మాణంలో భాగమయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హిప్ హాప్ తమిజ అందించిన మ్యూజిక్ కూడా ఎంతో సపోర్ట్ చేసింది.