
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది అది ఏ విషయంలో అంటారా దాదాపు నాలుగు సంవత్సరాల నుండి ఒకే సినిమా కోసం అహర్నిషలు కష్టడుతున్న ప్రభాస్ ఆ సినిమాలో తన పోర్షన్ కంప్లీట్ చేసుకున్నాడు. రాజమౌళి ఆలోచనలో బాహుబలి ఏరోజైతే వచ్చిందో అప్పటి నుండి తన లానే సినిమా కోసం మిగతా కెరియర్ వదిలి పనిచేశాడు ప్రభాస్. ఇక మొదటి పార్ట్ తో అంతకుమించిన క్రేజ్ తెచ్చుకున్నా ఇప్పుడు సెకండ్ పార్ట్ కు అంతా సంసిద్ధమవుతున్నారు.
ఏప్రిల్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న బాహుబలి కన్ క్లూజన్ కు డిసెంబర్ 31న గుమ్మడికాయ కొట్టేస్తున్నారట. ఇక దానికి ముందే ప్రభాస్ ఈ సినిమా నుండి బయటకు వెళ్తున్నాడట. డిసెంబర్ 27 కల్లా ప్రభాస్ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుందట. ఇక కేవలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద దృష్టి పెట్టనున్నాడు రాజమౌళి. మొదటి పార్ట్ తో తెలుగు సినిమా చరిత్రలోనే సంచలన విజయంగా చరిత్ర సృష్టించిన రాజమౌళి కన్ క్లూజన్ ను కూడా అదే రేంజ్ లో తెరకెక్కించాడట.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ నటించిన ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించగా ఆర్కా మీడియా నిర్మాణంలో సినిమా వస్తుంది.