కరీంనగర్ లో శాతకర్ణి ట్రైలర్..!

శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కరీంనగర్లో ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం ఏంటి అని కాస్త షాక్ అవ్వొచ్చు. నందమూరి నట సింహం బాలకృష్ణ వందవ సినిమాగా వస్తున్న శాతకర్ణి సినిమా క్రిష్ డైరక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఆడియోతో పాటుగా ట్రైలర్ కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని ఆడియో ఈ నెల 16 నుండి 24కు పోస్ట్ పోన్ అవడంతో ట్రైలర్ ను అనుకున్న డేట్ 16నాడే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.  

ఇక ఆడియో వేదిక తిరుపతిలో నిర్ణయించగా ఈ ట్రైలర్ లాంచ్ ను కరీంనగర్లో ప్లాన్ చేస్తున్నారట. అటు ఆంధ్ర, తెలంగాణ ప్రేక్షకులను కవర్ చేసేలా ట్రైలర్ తెలంగాణాలో ఆడియో ఆంధ్రాలో రిలీజ్ చేసి సినిమా మీద ఈ రకంగా క్రేజ్ పెరిగేలా చేస్తున్నారు. 60 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా కష్టపడ్డట్టు తెలుస్తుంది. శ్రీయా శరణ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా మైల్ స్టోన్ మూవీగా నిలిచేందుకు కష్టపడుతున్నాడు బాలయ్య. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ లో అంచనాలను పెంచేస్తున్నాడు. సంక్రాంతి బరిలో దిగుతున్న శాతకర్ణి సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.