
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్నప్రెస్టిజియస్ మూవీకి ఇన్నాళ్ళు రకరకాల టైటిల్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు సినిమాకు మరో కొత్త టైటిల్ ప్రచారంలో ఉంది. అదే సంభవామి.. ఏజెంట్ శివ, అభిమన్యుడు అంటూ హడావిడి చేసిన చిత్రయూనిట్ ఫైనల్ గా సంభవామి అన్న టైటిల్ కే మొగ్గుచూపారట. ఇక ఈ టైటిల్ ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారట. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.
మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఈ మూవీలో చాలా స్టైలిష్ గా ఉంటాడని అంటున్నారు. అయితే వినిపిస్తున్న ఈ టైటిల్ అయినా నిజమా కాదా అని తెలియాలంటే జనవరి 1 దాకా వెయిట్ చేయాల్సిందే. మహేష్ మురుగదాస్ టైటిల్ ఆరోజు రివీల్ చేస్తున్నారట. ఇక టీజర్ కూడా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేస్తారని టాక్.
మురుగదాస్ సినిమాలన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక మహేష్ తో తుపాకి రీమేక్ చేయాలని అప్పట్లో ప్రయత్నాలు చేయగా రీమేక్ అంటే ఇష్టం లేని మహేష్ ఆ సినిమా వద్దనేశాడు. ఇప్పుడు మరో అద్భుతమైన కథతో ఈ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. మరి ఈ క్రేజీ కాంబోలో వస్తున్న ఈ మూవీ ఎలాంటి సంచనాలను సృష్టిస్తుందో చూడాలి.