చిన్ని చిన్ని పాట.. ఇట్లు అర్జున

మహేష్ ఉప్పల దర్శకత్వంలో అయినేష్, అనశ్వర రాజన్ జంటగా నటిస్తున్న ‘ఇట్లు అర్జున’ నుంచి ‘చిన్ని చిన్ని..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ సోమవారం విడుదలైంది. కళ్యాణ్ చక్రవర్తి వ్రాసిన ఈ పాటకి తమన్ స్వరపరిచి సంగీతం అందించి, మోహిత్ చౌహాన్‌తో కలిసి పాడారు.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మహేష్ ఉప్పల, సంగీతం: తమన్, కెమెరా: రాజా మహదేవన్, స్టంట్స్:దినేష్ సుబ్బరాయన్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు. 

వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్: నం:1గా తీస్తున్న ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుమల నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇట్లు అర్జున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.