చిరు ముందే హెచ్చరించాడా..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ సినిమా నిన్న రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. కోలీవుడ్ లో ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి ఇక్కడ హిట్ అయ్యుంటుంది అనుకుంటే పొరపాటే సినిమాలో చరణ్ యాక్టింగ్ సురేందర్ రెడ్డి డైరక్షన్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇక సినిమా అంతా బాగున్నా లెంగ్త్ విషయంలో మాత్రం ప్రేక్షకులు కాస్త నిరాశ చెందుతున్నారు. 2 గంటల 39 నిమిషాలున్న ఈ సినిమా లెంగ్త్ విషయంలో కాస్త తగ్గించాల్సి ఉంటే బాగుండేది అనుకున్నారు.

ఇదే విషయం మెగాస్టార్ కూడా చెప్పాడట. ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత చిరుకి చూపించగా లెంగ్త్ కాస్త ట్రిం చేయాల్సిదిగా చెప్పాడట. డైరక్టర్ సురేందర్ రెడ్డి దానికి ఒప్పుకున్నా చరణ్ మాత్రం అసలు వద్దన్నాడట. అందుకే యాజిటీజ్ గా ఉంచేశారు. సినిమా టాక్ బాగానే ఉన్నా లెంగ్త్ విషయంలో వస్తున్న ప్రచారానికి ఇప్పుడు ఫీల్ అవుతున్నాడట చెర్రి. మరి చిరు అనుభవంతో చెప్పిన మాటలను పెడచెవిన పెట్టడం వల్లే ఇలా జరిగింది.

అయితే సినిమా అంచనాలను మించి ఉందని ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ స్టామినా ఏంటో ఈ సినిమా చూపిస్తుందని చెబుతున్నారు. ఊహించని ట్విస్ట్.. అదరగొట్టే మ్యూజిక్ ఇవన్ని సినిమా లెంగ్త్ ఎక్కువయినా సరే సూపర్ అనేలా చేస్తున్నాయి.