షాక్ : అవసరాల శ్రీనివాస్ కు అంత ఇస్తున్నారా..?

నటుడిగా ప్రయాణం మొదలు పెట్టి దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్ అడల్ట్ మూవీ రీమేక్ హంటర్ లో నటిస్తున్నాడు. సినిమా టైటిల్ గా 'బాబు బాగా బిజీ' అని పెట్టారు. మిస్తీ చక్రవర్తి, తేజశ్వి మడివాడ, శ్రీముఖి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నందుకు అవసరాల శ్రీనివాస్ కు అక్షరాల 2 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఏంటి ఒక్క సినిమాకు అంత మొత్తమా శ్రీని మినిమం గ్యారెంటీ హీరో కూడా కాదే అసలు అతను లీడ్ రోల్ గా చేసే మొదటి సినిమా ఇదే మరి ఎందుకు అంత డిమాండ్ అంటే.

బాలీవుడ్ హంటర్ ఓ అడల్ట్ బేస్డ్ మూవీ సినిమాలో హాట్ సీన్స్ చాలా ఉంటాయి. ఓ రకంగా ఇందులో నటించడానికి ఏ కుర్ర హీరో సాహసం చేయలేదట. అవసరాల ఆలోచన రావడం అతను చేస్తా అనడం అంతా ఓకే అవగా రెమ్యునరేషన్ గా 2 కోట్లు ఇస్తేనే తప్ప ఈ సినిమా చేయననేశాడట. వేరే హీరోలెవరు కనీసం చేయడానికి కూడా ఒప్పుకోకపోవడంతో అతను అడిగినంత ఇచ్చేందుకు ఓకే అనేశారట. 

టాలీవుడ్ లో సగటు హీరోలకు కూడా లేని రెమ్యునరేషన్ తో కెరియర్ రిస్క్ చేస్తున్న అవసరాల శ్రీనివాస్ ఈ సినిమా తర్వాత కాస్త కెరియర్ గ్రాఫ్ అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ సినిమాతోనే ఓ నాలుగైదు సినిమాల రెమ్యునరేషన్ లాగేసి డైరక్టర్ గా మళ్లీ బిజీ అవ్వాలని చూస్తున్నాడు.