పళ్ళ బురుసు టీజర్‌ చూశారా?

సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ‘పళ్ళ బురుసు’ సినిమా టీజర్‌ విడుదలైంది. ఇద్దరూ తండ్రీకొడుకులుగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు నటించారు. 

ఉదయ్ చౌహాన్ దర్శకత్వం తెలంగాణ గ్రామీణ నేపధ్యంలో తీసిన ఈ సినిమాలో ప్రజ్వల్ యద్మ, గోమతి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.         

ఈ సినిమాకు రచన, దర్శకత్వం: ఉదయ్ చౌహాన్; పాటలు: సురేష్ గంగుల; సంగీతం: పవన్ సీహెచ్, కెమెరా: వినోద్ కె.బంగారి; ఎడిటింగ్: సృజన అడుసుమిల్లి; కోరియోగ్రఫీ: విష్ణు ప్రిజర్వర్ చేశారు. 

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య పిట్టీ, వివేక్ క్రిష్ణాని కలిసి సిద్ధం చేసిన ఈ సినిమా  ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల కాబోతోంది.