
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా ఖైది నెంబర్ 150 మూవీకి సంబందించిన టీజర్ నిన్న సాయంత్రం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ నుండి వచ్చింబ ఈ టీజర్ కేవలం 3 గంటల 5 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ తో రచ్చ చేసింది. సో టీజర్ తోనే మెగా రికార్డులు షురూ చేశాడన్నమాట. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్ గా వస్తున్న ఖైది నెంబర్ 150 మూవీ మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించడం ఖాయం అంటున్నారు.
సంక్రాంతి రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమాను వినాయక్ డైరెక్ట్ చేస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈరోజు రిలీజ్ అయిన ధ్రువ సక్సెస్ తో ఫుల్ ఖుషిగా ఉన్న మెగా అభిమానులు ఈ టీజర్ సృష్టిస్తున్న రికార్డులతో మరింత ఉత్సాహంలో ఉన్నారు. ఇక సినిమా కూడా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటే 9 ఏళ్ల తర్వాత కూడా మెగాస్టార్ తన సత్తా చాటినవాడవుతాడు. ఇక సంక్రాంతికి చిరు ఖైదితో పాటుగా బాలయ్య వందవ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ అవుతుంది.
సో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. మెగా నందమూరి వార్ లో ఎవరిది పై చేయి సాధిస్తుంది అన్నది తెలియాలంటే పొంగల్ దాకా వెయిట్ చేయాల్సిందే.