మెగాస్టార్ ఓ స్వీట్ వార్నింగ్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైది నెంబర్ 150 సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను వినాయక్ డైరెక్ట్ చేస్తుండగా రాం చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టరే వారెవా అనిపించేలా చేసిన వినాయక్ ఇప్పుడు టీజర్ తో కూడా అదరగొట్టాడు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా అంటూ చిరు ఇచ్చిన స్వీట్ వార్నింగ్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది.

టీజర్ లో చిరు మెగా లుక్.. వెనుక దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లోనే సినిమా చూపించేశారు లేండి. మెగాస్టార్ 9 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా కాదు మంచి ఫాంలో ఉన్నప్పుడు వచ్చిన సినిమాగా ఆయన లుక్ కనిపిస్తుంది. నిడివి తక్కువున్నా టీజర్ లో సినిమా స్ట్రెంత్ ఏంటి అన్నది తెలుస్తుంది. ఇక మెగాస్టార్ ఇచ్చిన వార్నింగ్ కు ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. ఓ పక్క తెల్లారితే ధ్రువగా మెగా పవర్ స్టార్ వస్తుండగా ఈరోజు సాయంత్రమే మెగాస్టార్ ఖైది టీజర్ తో అలరించాడు. మెగా అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ ఇచ్చిన ఈ గిఫ్ట్ ల ఫలితం ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.