
దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా అంటేనే నూటికి నూరు శాతం వినోదం... పైసా వసూల్! ఆయన సినిమా ప్రమోషన్స్ కూడా అలాగే ఉంటాయి. తాజాగా వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో తీయబోతున్న మల్టీ స్టార్ మూవీ ప్రమోషన్ చూస్తే నవ్వాపుకోలేము. ఇటీవలే హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది. సోమవారం నుంచి షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.
ఈసారి రాయలసీమ నేపధ్యంతో సినిమా చేస్తున్నానని తెలియజేస్తూ ఓ హీరో, హీరోయిన్లతో ఓ చక్కటి వీడియో చేసి వదిలారు అనిల్ రావిపూడి. అది చూసినప్పుడు మూవీ ప్రమోషన్స్ ఇలా కూడా చేయవచ్చా? అనిపిస్తుంది.
రాయలసీమ కథ కనుక నెత్తిపై ఎర్రటి తలపాగా, చేతిలో కత్తి పట్టుకొని వస్తాడు. ప్రతీసారి నేనే ఐడియాలు ఇవ్వాలా? మీరివ్వరా? అని వెంకటేష్‌ని నిలదీస్తాడు. ఆ తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేము. వీడియో ముగిస్తూ, “ఎంత రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ అయినప్పటికీ మరీ ఇంత రక్తపాతం అవసరమా? మనది ఫ్యామిలీ బ్యాక్ గ్రాండ్... ప్లీజ్...” అంటూ ముగించడం చాలా బాగుంది.
ఈ సినిమాలో వెంకటేష్-కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్కృతి శెట్టి జంటగా చేస్తున్నారు. ఈ సినిమాకి జీవి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఈ వీడియోలో హీరో, హీరోయిన్ల చేతే అనిల్ రావిపూడి ప్రకటించారు.