
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత జీవితం పెద్ద తుఫానులో చిక్కుకున్నట్లయింది. ఓ పక్క ఆ మానసిక క్షోభ, అనారోగ్య సమస్యలు, చేసిన సినిమాలన్నీ వరుసపెట్టి ఫ్లాప్ అవుతుండటం చూసినప్పుడు, సమంత పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. నిజానికి ఒకేసమయంలో అన్ని వరుస దెబ్బలు తిని తట్టుకొని నిలబడటం ఎవరి వల్ల కాదు.
కానీ సమంత జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ అక్కడి నుంచే ప్రారంభించి ‘మా ఇంటి బంగారం’ అనిపించుకుంది. సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’లో కీలకపాత్ర లభించడం, ఆ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడటంతో ఆమె వ్యక్తిగత, సినీ జీవితంలో మళ్ళీ మార్పు మొదలైంది.
వారిరువురు పెళ్ళి చేసుకున్నాక భర్త సహాయ సహకారాలు లభించడంతోఅంత వరకు నత్త నడకన సాగుతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాని చకా చకా పూర్తిచేసి విడుదల చేయగలిగారు. ఈ సినిమా సక్సస్ మీట్‌లో భర్తతో కలిసి మీడియా ముందుకు వచ్చినప్పుడు తాను గర్భం దాల్చననే విషయం చెప్పకనే ‘బేబీ బంప్’తో చెప్పేశారు. కనుక సమంత వ్యక్తిగత, సినీ జీవితం మళ్ళీ గాడిన పడినట్లే అనుకోవచ్చు.