గోపీచంద్‌ కెరీర్లో ఇదే భారీ బడ్జెట్‌ సినిమా?

‘ఘాజీ’ వంటి వినూత్నమైన కథతో ప్రేక్షకులను అలరించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ‘భరత వర్ష’ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట రూ. కోట్లు30 70ఈ పీరియాడికల్ మూవీలో గోపీ చంద్‌కు జోడీగా రీతూవర్మ చేస్తోంది.

మొదట భరత వర్ష బడ్జెట్‌ 30 కోట్లనుకొని మొదలు పెట్టారు. కానీ క్రమంగా అది 70 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. టాకీ పార్ట్ చాలా వరకు పూర్తయినట్లు సమాచారం. కనుక సినిమా పూర్తయ్యేలోగా బడ్జెట్‌ మరో 10 కోట్లు పెరిగినా ఆశ్చర్యం లేదు. అయితే సినిమా అవుట్ పుట్ ఆశించిన దానికంటే బాగా వచ్చినందున నిర్మాత వెనకడుగువేయడం లేదని తెలుస్తోంది. ఈ లెక్కన గోపీచంద్ సినిమాలలో ఇదే తొలి దశ భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుంది.         

భరత వర్షలో వినోద్ కుమార్, గావీ చాహల్, తణికెళ్ల భరణి, రాకేష్ వర్రే, భారత్ రెడ్డి, ఛత్రపతి శేఖర్, రవి వర్మ, కిషోర్, కార్తికేయ, మధుమణి, బేబీ తేజల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.  

భరత వర్షకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: సంకల్ప్ రెడ్డి, పాటలు: చంద్రబోస్, కళ్యాణ్ చక్రవర్తి

సంగీతం: అనుదీప్ దేవ్, కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, అదనపు డైలాగ్స్: వినయ్ వొక్కపట్ల, ఆర్ట్: స్టంట్స్: వెంకట్, పృధ్వి, రియల్ సతీష్, రాజేష్ లంకా, వెంకటరావు, ఎడిటింగ్:  చోటా కె ప్రసాద్

చేస్తున్నారు.  

సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌పై  శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 18న భరత వర్ష విడుదలయ్యే అవకాశం ఉంది.