పెద్ది 5 రోజుల కలెక్షన్ రిపోర్ట్!

బుచ్చిబాబు సనా దర్శకత్వం రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేసిన పెద్ది భారీ అంచనాలతో జూన్‌ 4న విడుదలైంది. ఊహించినట్లే సినిమా అంచనాలకు మించి ఉండటంతో మంచి కలెక్షన్స్‌ సాధిస్తూ దూసుకుపోతోంది. మొదటి 5 రోజులలోనే పెద్ది రూ.315 కోట్లు (గ్రాస్) సాధించింది. పెద్ది ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే వెయ్యి కోట్లు క్లబ్‌లో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది.

గ్రామీణ క్రీడాంశం తీసుకొని దానికి అన్ని కమర్షియల్ హంగులు సరిగ్గా కలపడంతో క్లాస్ అండ్ మాస్ అన్ని వర్గాలవారిని పెద్ది ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ అందించిన సంగీతం, రత్నవేలు కెమెరా పనితనం బాగా కలిసివచ్చింది. అలాగే అప్పలసూరిగా జగపతిబాబు అద్భుతంగా నటించి మెప్పించారు.