స్క్రిప్ట్ రెడీ మీదే ఆలస్యం: అనిల్ రావిపూడి

దర్శకుడు అనిల్ రావిపూడి చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఈ సంక్రాంతికి హిట్ కొట్టిన వెంటనే వెంకటేష్‌, కళ్యాణ్ రామ్‌లతో మల్టీ స్టార్ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ 5 నెలల్లో ఆ సినిమాకి స్క్రిప్ట్ సిద్దం చేసేశారు. మొన్న తన స్వగ్రామం బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం చిలుకూరివారి పాలెంలో శ్రీ బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్క్రిప్ట్ కి పూజ చేయించి తల్లితండ్రులు అనంతలక్ష్మి రావిపూడి బ్రహ్మయ్యల చేతుల మీదుగా అందుకున్నారు.   

ఈ సినిమాలో వెంకటేష్‌-కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌ క్రుతిశెట్టి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి జీవి. ప్రకాష్ కుమార్‌ సంగీత దర్శకుడు. ప్రస్తుతం వెంకటేష్‌ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం ‘ఆదర్శ కుటుంబం’ చేస్తున్నారు. అది జూలై నెలాఖరులోగా పూర్తయితే ఆగస్ట్ నుంచి అనిల్ రావిపూడి మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.