పెద్ది: మన దేశపు మట్టి... జీవనానికి ప్రతీక: రామ్‌ చరణ్‌

పెద్ది సినిమాకి సంబంధించినంత వరకు అన్ని పనులు పూర్తయిపోయినట్లే. టీజర్‌, పాటలు, ట్రైలర్‌ విడుదల చేసేశారు. సెన్సార్ పని పూర్తయిపోయింది. ఇక జూన్‌ 4న విడుదల కోసం పెద్ది టీమ్‌తో సహా అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ గ్యాప్‌లో రామ్‌ చరణ్‌ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ పెద్ది గురించి ఆసక్తికరమైన విషయాలు చెపుతున్నారు.

తాజా ఇంటర్వ్యూలో పెద్ది గురించి చెప్పమన్నపుడు, “పెద్ది మన దేశపు మట్టి కథ. మన యువత గుండె చప్పుడు. మన ఆశలు, ఆశయాలు, గెలుపోటములు అన్నిటికీ అద్దం పట్టే సినిమా. ఇది మన దేశ కథ. ఆరేళ్ళు నుంచి 60 ఏళ్ళ వయసు వరకు ప్రతీ ఒక్కరూ పెద్దిని చూసి ఆనందిస్తారని చెప్పగలను. దీని కోసం నేను మనసు పెట్టి ఎంతగా శ్రమించానో పెద్ది చూసినప్పుడు అందరికీ అర్ధమవుతుంది,” అని అన్నారు.

#Peddi సినిమా కి చరణ్ ఇచ్చిన అందమైన నిర్వచనం🔥👌#Peddi pic.twitter.com/SfkMUd1uQA
— Telugu360 (@Telugu360) May 27, 2026

Video courtesy: Telugu 360