చెన్నై లవ్ స్టోరీ వదలనే.. లిరికల్

రవికుమార్ నంబూరి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి వదలనే... నిన్ను వదలనే...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ సోమవారం విడుదల చేశారు. అనంత శ్రీరాం వ్రాసిన ఈ పాటకి మణిశర్మ సంగీతం అందించగా జావేద్ అలీ హృదయాన్ని తాకేలా చక్కగా పాడారు.  

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవికుమార్ నంబూరి, కధ: సాయి రాజేష్, సంగీతం: మణిశర్మ, కెమెరా: విశ్వాస డేనియల్ చేస్తున్నారు. 

మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్ బ్యానర్లపై సాయి రాజేష్, ఎస్‌కెఎన్‌, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.  చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ జూన్ 26న విడుదలయ్యే అవకాశం ఉంది.