
ఇప్పుడు స్టైలిష్ స్టార్ గా అభిమాన నీరాజనాలు అందుకుంటున్న అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి చూసి అందరు కాస్త నెగటివ్ గా అనుకున్నారు. అనుకోవడమే కాదు తండ్రి నిర్మాత కాబట్టి కొడుకు ఎలా ఉన్నా సరే హీరోని చేశాడనే వార్తలు గట్టిగానే వచ్చాయి. అయితే అలా వచ్చిన తన మీద రూమర్స్ కు బన్ని హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు టాలీవుడ్ లో స్టైలిష్ కు ఐకాన్ గా నిలిచాడు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ బడా నిర్మాత దిల్ రాజు కూడా గంగోత్రి టైంలో బన్ని హీరో ఏంటి అనుకున్నానని కాని ఆ తర్వాత ఆర్య సినిమా చేశాక కాని తాను సినిమా కోసం ఎంత కష్టపోడతాడో తెలిసిందని చెప్పాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో దువ్వాడ జగన్నాథం సినిమా సెట్స్ మీద ఉంది. బన్ని ఎలా హీరో అవుతాడు అనుకున్న నిర్మాతే బన్నితో సినిమా కోసం క్యూ కట్టేలా చేసుకున్నాడు అల్లు వారి అబ్బాయి. ఓ రకంగా మెగాస్టార్ సినిమాలను తగ్గించాక మెగా అభిమానులకు చెర్రితో పాటుగా దగ్గరైన అల్లు అర్జున్ వరుస విజయాలతో బాక్సాఫీస్ బాద్షాగా నిలిచాడు. సినిమా తీస్తే హిట్ అన్న పంథాలో కొనసాగుతున్న బన్ని కెరియర్ ఇలానే సూపర్ డూపర్ హిట్లతో నడవాలని ఆశిద్దాం.