నారా రోహిత్ కొత్త దర్శకుడుతో కొత్త సినిమా

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన కధలతో సినిమాలు చేసే యువ హీరోలలో నారా రోహిత్ కూడా ఒకరు. అందువల్లే ఏడాదికో రెండేళ్ళకో అతను నటించిన సినిమా వస్తుంటుంది. తాజాగా నారా రోహిత్ హీరోగా చేయబోతున్న 23వ సినిమా ప్రకటన పోస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమాతో చినిమిల్లి మణి కుమార్‌ దర్శకుడుగా సినీ పరిశ్రమకి పరిచయం అవుతున్నారు. మణి కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై (ప్రొడక్షన్ నం:5)భరత్ చౌదరి ఈ సినిమా నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్‌, ఇతర నటీనటుల పేర్లు, సాంకేతిక నిపుణుల పేర్లు ప్రకటిస్తామని దర్శకుడు మణి కుమార్‌ తెలిపారు.