రాకాలో అల్లు అర్జున్‌ పాత్రపై ఈ టాక్ విన్నారా?

కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ దర్శకత్వం అల్లు అర్జున్‌ హీరోగా చేస్తున్న ‘రాకా’ టైటిల్‌ పోస్టర్తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానిలో అల్లు అర్జున్‌ పదునైన గోళ్ళు కలిగిన రాక్షసుడిలా చూపారు. ఇప్పుడు ఈ పాత్ర గురించి కొత్త టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పగలు మనిషిలా రాత్రిపూట రాక్షసుడిగా మారిపోతారని టాక్ వినిపిస్తోంది. అంటే హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారనుకోవచ్చు.    

ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ అని అట్లీ ముందే చెప్పారు. కనుక ఇలాంటి పాత్ర సృష్టించడం పెద్ద కష్టం కాదు. కనుక ఈ టాక్ నిజమే అని భావించవచ్చు. ఇది ఇంటర్వెల్ బ్యాంగ్ అని తెలుస్తోంది.  

ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకొణేతో పాటు జాన్వీ కపూర్, రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం దర్శక నిర్మాతలు ఇంకా అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలకపాత్ర చేస్తున్నారు. 

ప్రస్తుతం ముంబయిలో రాకా షూటింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. 2027 వేసవిలో రాకా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటులు, దీనికి పని చేస్తున్న సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సుమారు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో 9 భారతీయ భాషల్లో రాకా నిర్మిస్తున్నారు.