కె.టి.ఆర్ మెచ్చిన ధ్రువ.. పిలిస్తే వైజాగ్ వస్తా..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో జరిగింది. మెగా అభిమానుల సమక్షంలో జరిగిన ఈ మెగా వెడుకకు తెలంగాణ ఐటి, పంచాయితీరాజ్ శాఖా మంత్రి కె.టి.ఆర్ అటెండ్ అయ్యారు. ఇక ఆంధ్రా మంత్రి గంటా శ్రీనివాస్ రావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. చరణ్ సూపర్ డూపం టాలెంట్ హీరో అని.. చరణ్ చేసే ప్రతి సినిమా తను చూస్తానని చాలా బాగా కష్టపడతానని అన్నారు కె.టి.ఆర్. ఇక తన లక్కీ నెంబర్ అయిన 9.. ఈ సినిమాకు కూడా చరణ్ కు 9వ సినిమా కాబట్టి చరణ్ కు ధ్రువ సూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నారు.

ఇక చరణ్ ధ్రువలో ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ లో సూపర్ గా ఉన్నాడని టీజర్ లో లుక్ చాలా స్టైలిష్ గా ఉందని అన్నారు. సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. ఇక ఇదే కార్యక్రమంలో గంటా శ్రీనివాస్ రావు గారు అంతకుముందు ధ్రువ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ వైజాగ్ లో చేయాలని అనగా దానికి రెస్పాన్స్ అవుతూ శ్రీనన్నా వైజాగ్ లో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కు పిలిస్తే తాను కూడా వస్తానని అన్నారు. 

ఇక ధ్రువ సినిమాలో విలన్ గా నటించిన అరవింద్ స్వామి గురించి కూడా మాట్లాడిన కె.టి.ఆర్ తను రోజా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అదేలా ఉన్నారని. తన ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో దాన్ని తాను కూడా ట్రై చేస్తానని అన్నారు. ఇక చరణ్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ ట్రై చేశాడని తాను కూడా కుదిరితే 2 ప్యాక్ ప్రయత్నిస్తానని అన్నారు. మెగా అభిమానుల కోలాహలంతో ధ్రువ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది.