
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమా ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. విజయవాడ రౌడియిజం నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా ముందునుండి ఎన్నో బెదిరింపులతో స్టార్ట్ చేశారు. ఇక కొద్దిగంటల క్రితం అదే విజయవాడలో వంగవీటి ఆడియో రిలీజ్ జరుపుకున్నారు. వర్మ ఫ్యాన్స్ తో పాటుగా వంగవీటి మీద ఉన్న అభిమానంతో అక్కడికి ప్రేక్షకులు వేలకొద్ది వచ్చారు.
ఇక ఇది వంగవీటి కత్తి కాపు కాసే శక్తి అంటూ సినిమాలో తను పాడిన సాంగ్ తో తన స్పీచ్ మొదలు పెట్టిన వర్మ వంగవీటి కథ నా కోణంలో చెప్పానని.. తను చదువుకునే రోజుల్లో రంగ గారు చేసిన ర్యాలిలో ఓసారి తను పాల్గొన్నానని.. ప్రత్యేకంగా ఈ సినిమా నా కెరియర్ అని బెస్ట్ అని చెబితే బాగోదనుకుంట కాని ఈ సినిమా తీయడానికి తాను చిన్నప్పటి నుండి ఆలోచనలో ఉన్నానని అన్నారు వర్మ. కాలం తీరని కథ కాబట్టే ఈ సినిమాను తీయాలని అనుకున్నా.. ఇక సినిమా కోసం తాను మాత్రమే కాదు చిత్రయూనిట్ కూడా బాగా కష్టపడింది. ముఖ్యంగా నిర్మాత దాసరి కిరణ్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారని అన్నారు.
ఇక మధ్యలో వంగవీటి అభిమానులు రంగ డైలాగులు చెప్పమని కోరగా వారిని ఓ డైలాగుతోనే రెపాన్స్ ఇచ్చి సినిమాలోనే ఆ డైలాగులు వినాలని అన్నారు రాం గోపాల్ వర్మ. డిసెంబర్ 23న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలానలను సృష్టిస్తుందో చూడాలి.