
జనతా గ్యారేజ్ హిట్ తర్వాత మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసిన తారక్ తన తర్వాత సినిమా విషయంలో ఇంకా క్లారిటీకి రాలేదు. కథలు వింటున్నా సరే ఏవి తనకు నచ్చట్లేదని తెలుస్తుంది. ఈ క్రమంలో తారక్ ఈసారి కొత్తగా మల్టీస్టారర్ మీద దృష్టి పెట్టబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే పూరి తారక్, అల్లు అర్జున్ హీరోలుగా మల్టీస్టారర్ ప్లాన్ చేశారని తెలిసిందే. అయితే ఈ కథ నచ్చినా పూరితో సినిమా రిస్క్ అని డౌట్ పడుతున్నాడట.
ఇక ఇదే క్రమంలో రెండు సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనీల్ రావిపూడి కూడా ఓ మల్టీస్టారర్ కథ చెప్పాడట. అయితే ఈ కథలో మరో హీరో నాని అనుకున్నాడట అనీల్ రావిపూడి. నాని ఎన్టీఆర్ డిఫరెంట్ కాంబినేషన్ ఓ విధంగా క్రేజీ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు. మరి ఎక్కడ ఆగిందో ఏమో కాని తారక్ ఈ సినిమా మీద కూడా ఆలోచనలో పడ్డాడట. అనీల్ చెప్పిన కథ బాగున్నా ఇందులో యంగ్ టైగర్ తో నాని చేసేందుకు ఒప్పుకుంటాడా అన్నది డౌటే.
మొత్తానికి తన ముందు ఉన్న రెండు మల్టీస్టారర్ కథలను ఆలోచిస్తు ఉన్నాడట జూనియర్. అయితే ఈలోపు కథ నచ్చితే సోలోగా వచ్చేలా చూస్తున్నా ఏ ఒక్క సబ్జెక్ట్ తనను సాటిస్ఫై చేయట్లేదని తెలుస్తుంది. మరి ఫైనల్ గా తారక్ ఏ సినిమా కమిట్ అవుతాడో చూడాలి.