సరస్వతి ట్రైలర్‌... న్యాయం కోసం ఓ తల్లి పోరాటం

ప్రముఖ కోలీవుడ్‌ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌  స్వీయ దర్శకత్వంలో చేసిన సినిమా సరస్వతి. ఇది కూతురు కోసం ఓ తల్లి చేసిన న్యాయపోరాటం... దానిలో గెలవలేమని గ్రహించిన తర్వాత ఏం చేసిందనేది ఈ సినిమా... అని ఈరోజు విడుదలైన ట్రైలర్‌తో చెప్పేశారు. 

ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్‌, ప్రియమణి, ప్రకాష్ రాజ్, నాజర్, మురళీశర్మ, శ్రీనివాస్‌ అయ్యంగార్, రావు రమేష్, రఘుబాబు, రాధికా శరత్ కుమార్‌, తులసి, సప్తగిరి, హరీష్ పేరడి, మీం గోపి, గెటప్ శ్రీను, వెంకట్, కిషోర్, నివేక్ష, ప్రమీల రాణి ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ: సాయి మాధవ్ బుర్రా, దర్శకత్వం: వరలక్ష్మి శరత్ కుమార్‌, సంగీతం: తమన్, కెమెరా: ఎడ్విన్ సాకే, ఆర్ట్: శుదీర్ మాచర్ల, స్టంట్స్: నందు మాస్టర్, ఎడిటింగ్: వెంకట్ రాజెన్ చేశారు. 

ఈ సినిమాని పూజా శరత్ కుమార్‌, వరలక్ష్మి శరత్ కుమార్‌ కలిసి దోసా డైరీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నిర్మించారు. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.