
ఓ పక్క స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా హల్ చల్ చేస్తూనే మరో పక్క గ్లామర్ షోతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రష్మి ఇప్పుడు ఏకంగా ఐటం సాంగ్ కూడా చేసేందుకు సిద్ధమయ్యిందట. స్టార్ సినిమా అయినా స్మాల్ సినిమా అయినా సందర్భం దొరికితే చాలు ఐటం సాంగ్ ఇరికించే ప్రయత్నం చేస్తారు ఈ ప్రయత్నంలో రాజ్ తరుణ్ హీరోగా వంశీ కృష్ణ డైరక్షన్లో వస్తున్న సినిమా కిట్టుగాడులో రష్మితో ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు.
గుంటూర్ టాకీస్ తో వచ్చిన హాట్ ఇమేజ్ తో అదే తరహా పాత్రలు చేస్తూ నాలుగు రాళ్లు వెనుకేసుకుంటున్న రష్మి ఇప్పుడు మరో టర్న్ తీసుకుని ఐటం గా కూడా అదరగొట్టాలని చూస్తుంది. రాజ్ తరుణ్ ఆఫర్ గురించి అమ్మడి రెస్పాన్స్ ఎలా ఉందో తెలియదు కాని చేస్తే కనుక మళ్లీ రష్మి రేంజ్ పెరిగిపోయినట్టే. ఇక కుర్ర హీరోల్లో తన హవా కొనసాగిస్తున్న రాజ్ తరుణ్ ఈమధ్య తన సినిమాల వేగాన్ని తగ్గించినా సరైన హిట్ కొట్టేందుకు కిట్టుగాడుగా వస్తున్నాడు.
రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా సినిమా మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త అనే క్యాప్షన్ కూడా చాలా కొత్తగా ఉంది. మరి వరుస హిట్లతో ఉన్న రాజ్ కెరియర్ కాస్త క్లారిటీ మిస్ అవుతున్న సందర్భంలో ఈడోరకం ఆడోరకం హిట్ ఇచ్చింది ఇక ఆ తర్వాత వస్తున్న ఈ సినిమా ఆ హిట్ మేనియా కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.