హే భగవాన్... టీజర్‌ మామూలుగా లేదు

ఆలూ లేదు చూలూ లేదు... కొడుకు పేరు కృష్ణమనోహర్ ఐపీఎస్! గోపి అచ్చర దర్శకత్వంలో సుహాస్, శివాని జంటగా నటిస్తున్న ‘హే భగవాన్’ సినిమా టీజర్‌లో ఓ డైలాగ్ ఇది.

ఫ్యామిలీ బిజినెస్ గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాలని తండ్రి (నరేష్) అనుకుంటే అదేమిటో తెలియకుండానే చేపట్టాలనుకునే కొడుకు (సుహాస్) ఒకటిన్నర నిమిషాలు నిడివి గల టీజర్‌లో నవ్వులు పూయించారు. టీజర్‌ ఈ రేంజ్‌లో ఉంటే ఇక ఫిభ్రవరి 20న విడుదలకాబోతున్న ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

ఈ సినిమాలో నరేష్, అన్నపూర్ణ, సుదర్శన్, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. సుహాస్ సూపర్ హిట్ సినిమా ‘రైటర్ పద్మభూషణ్’కు దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకి కధ అందించారు. ఈ సినిమాకి కెమెరా: మహిపాల్ రెడ్డి, ఎడిటింగ్: విప్లవ్‌, ఆర్ట్: ఏ రామ్ కుమార్‌ చేశారు.    

త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ‘హే భగవాన్’ ఫిభ్రవరి 20న విడుదల కాబోతోంది.