తారక్ విషయంపై మాట మార్చిన దర్శకుడు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని తమిళ దర్శకుడు హరి అన్న మాటలు ఓ వారం రోజుల నుండి హాట్ న్యూస్ గా ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తారక్ ను ఎవరో తెలియదు అంటే జూనియర్ ఫ్యాన్స్ బాగా ఇబ్బంది పడ్డారు. అయితే ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి ఆ దర్శకుడి చెవిన పడ్డది. వెంటనే ఓ స్పెషల్ ఇంటవ్యూలో ఎన్టీఆర్ గురించి తన మీద వస్తున్న రూమర్స్ గురించి స్పందించాడు హరి.  

సింగం సీరీస్ లతో సూపర్ హిట్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న హరి ఈ నెల 16న సూర్య ఎస్-3తో వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఎవరు పుట్టించారో తెలియదు కాని తారక్ అంటే ఎవరో తనకు తెలియదు అని హరి అన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెగ హడావిడి చేయడంతో ఇప్పుడు డైరక్టర్ హరి దానికి రెస్పాండ్ అయ్యాడు. తారక్ అంటే తనకు చాలా ఇష్టమని.. తను నటించిన టెంపర్ సినిమా రెండు సార్లు చూశానని.. ఇప్పటికే తనతో ఓ కథ కూడా డిస్కస్ చేశాను కాని అది వర్క్ అవుట్ కాలేదని అన్నారు.    

తను ఎవరో తెలియదు అన్న మాటల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చాడు. అఫ్కోర్స్ హరి కూడా అలా అని ఉండే ఛాన్స్ లేదు కాని మధ్యలో ఎవరో ఈ న్యూస్ పుట్టించారు. హరి క్లారిటీ ఇచ్చినా సరే అతని మీద గుస్సుగా ఉన్నారు తారక్ అభిమానులు. ఈ ప్రభావం ఎస్-3 మీద ఉంటుందేమో అని సూర్య ఓ పక్క టెన్షన్ పెట్టుకున్నాడు.