
మారుతి-ప్రభాస్ కాంబినేషన్లో జనవరి 9న వస్తున్న ‘రాజాసాబ్’ హడావుడి మొదలైపోయింది. నేడు మరికొద్ది సేపటిలో హైదరాబాద్, కూకట్‌పల్లిలోని ఖైతలాపల్లి మైదానంలో రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలవబోతోంది.
ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉండటంతో అభిమానులతో పాటు ప్రజలు కూడా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. అయితే అంచనాలకు మించి జనం వస్తే తొక్కిసలాట జరుగుతుంటుంది. కనుక ముందుగా పాసులు తీసుకున్నవారిని మాత్రమే ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొనేందుకు అనుమతిస్తామని నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
అయితే ముందుగానే పాసులు జారీ చేసినప్పటికీ సుమారు 50-70 వేల మందికి పైగా జనం వచ్చే అవకాశం ఉంటుందని నిర్వాహకులు అంచనా వేశారు. తదనుగుణంగానే భారీగా బందోబస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌తో సహా అందరూ పాల్గొంటారు.
రాజాసాబ్ జనవరి 9న విడుదల కాబోతోంది. కనుక ఒకరోజు ముందే ప్రీమియర్స్ ఉంటాయని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఇదివరకే చెప్పారు.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్, రిద్ధి కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు.